Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన అంజనీ కుమార్
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
డీజీపీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. దీనిని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. 'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అని అలాంటి కీలకమైన నేత్రాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం సంతోషదాయకమని ఆయన అన్నారు. డీజీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందులో అధికారులు మొదలుకొని సిబ్బంది వరకు ప్రతి రోజు వంద మందికి పరీక్షలు జరిపించనున్నామని ఆయన చెప్పారు.