Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26 నుంచి ఆరు లక్షల గ్రామాల్లో రాహుల్ సందేశం : పవన్ ఖేరా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30తో ముగుస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరు లక్షల గ్రామాల్లో యాత్రలు నిర్వహించటం ద్వారా పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేస్తాయని వెల్లడించారు. బుధవారం గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగాయనీ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు రోడ్డున పడ్డారని విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా 100 మంది బడా పారిశ్రామికవేత్తల వద్ద రూ.13 లక్షల కోట్ల సంపద పోగుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టటం ద్వారా ఆ పార్టీ తన పబ్బం గడుపుకుంటున్నదన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారనీ, వాస్తవంగా అది వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్) అని ఎద్దేవా చేశారు.