Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 ఎమ్మెల్యే స్థానాల్లో ఎంసీపీఐ(యూ),బీఎల్పీ, బీసీపీ, ఎంబీటీలతో కలిసి పోటీ చేస్తామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లోని ఓంకార్ భవన్లో బీఎల్ఎఫ్ ఐదో ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్ష పార్టీలు ఒకే శక్తిగా బీఎల్ఎఫ్లో భాగస్వాములై రాజ్యాధికారం సాధించాలని కోరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనే శక్తి, సిద్ధాంతం కాంగ్రెస్, బీఆర్ఎస్కు లేవని చెప్పారు. సిద్ధాంతం ఉన్న కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు మాత్రమే ఎదుర్కొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, బీసీపీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, ఎస్ సిద్ధిరాములు, హంసారెడ్డి, కన్నం వెంకన్న, పెద్దారపు రమేష్, బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎంఎం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.