Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కావట్లేదనీ, కల్వకుంట్ల వారి రాజ్యాంగం అమలవుతున్నదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభలకు అడ్డురాని కరోనా, గణతంత్ర వేడుకలకు అడ్డొచ్చిందా అని బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో ప్రశ్నించారు. భారత రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం, విశ్వాసం లేని సీఎం కేసీఆర్ దాన్ని మార్చాలని చెప్పినప్పుడే దేశద్రోహి అని అర్థమయ్యిందన్నారు. హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు.