Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ కు యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోలీస్ నియామకాల్లో ప్రభుత్వం చేసిన తప్పిదాలకు యువత బలయ్యారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్కు ఆయన నేతృత్వంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విషయాన్ని అనేక సార్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మెన్ వి.వి.శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లామనీ, ఏడు మార్కులు కలపాలంటూ హైకోర్టు సూచించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికే 18 మంది విద్యార్థులు చనిపోయారనీ, రన్నింగ్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ లో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ స్పందించకుంటే అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు.