Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోమ్ పర్యటనలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో 'నీరా'కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదని పర్యాటక, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. తమ శాఖ ఆధ్వర్యంలో సుమారు 3.75 కోట్ల ఈత, తాటి మొక్కలను నాటామన్నారు. ఈత, తాటి చెట్ల నుంచి నీరా, బెల్లం, తేనె, సిరప్‌లను తయారు చేస్తున్నామని రోమ్ నగరంలో పర్యటిస్తున్న ఆయన తెలిపారు. ఆల్కాహాల్ రహిత పానీయంగా నీరాను ఉత్పత్తి చేస్తున్నామనీ, దానితో పాటే మరిన్ని ఉప ఉత్పత్తులనూ ప్రోత్సహిస్తున్నట్టు బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు.