Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గురుపూర్ణిమ సందర్భంగా జులై 2వ తేదీ హైదరాబాద్లో గురుపూజా మహౌత్సవాలు నిర్వహించనున్నట్టు ఎంపీ రవిచంద్ర తెలిపారు. బుధవారంనాడయన స్వగృహానికి స్వామి గురవానంద విచ్చేసి, ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. మంత్రి గంగుల కమలాకర్, లోక్సభ సభ్యులు బీ.బీ.పాటిల్, ఎమ్మెల్సీ సుంకరి రాజు (శంభీపూర్ రాజు), హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, ప్రముఖ వ్యాపారవేత్తలు రవీందర్ రెడ్డి, సదా విజరు కుమార్, పౌరసరఫరాల సంస్థ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.