Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు 'పద్మ' అవార్డులకు ఎంపిక కావటం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాము ఎంచుకున్న రంగాల్లో అత్యంత ప్రతిభను కనబరుస్తూ, చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ, బాధ్యతగా వ్యవహరించటం ద్వారా వారు రేపటి తరానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
అజ్మీర్ దర్గాకు చాదర్‌ను పంపండి..
అధికారులకు ఆదేశాలు
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించే 'చాదర్'ను సీఎం కేసీఆర్ ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ముస్లిం మత పెద్దల సమక్షంలో దైవ ప్రార్థనల అనంతరం అజ్మీర్ దర్గాలో చాదర్‌ను సమర్పించేందుకు వీలుగా అక్కడికి దాన్ని పంపాలంటూ వక్ఫ్ బోర్డు అధికారులను ఆదేశించారు.