Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పల్లా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ఏనాడూ ఎవ్వరూ ఆలోచించని విధంగా మోడీ ప్రభుత్వం... రైతాంగంపై పన్ను వేయాలనుకోవటం అత్యంత దుర్మార్గమని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మెన్ వివేక్ దేబ్రారు... ఒక పత్రికలో రైతుల ఆదాయంపై కూడా పన్నేయాలంటూ వ్యాసం రాశారని గుర్తు చేశారు. ఇది ఆయన మాటగా తాము భావించటం లేదనీ, మోడీ మన్ కీ బాత్గా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, యెగ్గె మల్లేశంతో కలిసి పల్లా విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ స్వయంగా ప్రధానే అనేకసార్లు ప్రకటించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 60 ఏండ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామని కూడా బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీనిచ్చిందని తెలిపారు. వ్యవసాయానికి రూ.30 లక్షల కోట్లను బడ్జెట్లో కేటాయిస్తామంటూ ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. వాటన్నింటినీ ఇప్పుడు తుంగలో తొక్కారని విమర్శించారు. మరోవైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయంపై పన్నేయాలం టూ సూచించిన వివేక్ దేబ్రారును వెంటనే బాధ్య తల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.