Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బీసీ కుల సంఘాల భవనాల నిర్మాణాలకు ముహూర్తాలు ఖరారు చేసినట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పిభ్రవరి 5న కొకాపేట్లో, 6న ఉప్పల్ భగా యత్లో సామూహిక భూమి పూజలు నిర్వహించనున్నట్టు వివ రించారు. 16 భవన నిర్మాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో, 18 బీసీ ఏక సంఘాల సారథ్యంలో నిర్మాణాలు చేపడుతున్నామని బుధవారం 32 బీసీ కుల సంఘాల నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలో తెలిపారు. 41 బీసీ ఆత్మగౌరవ భవనాల కోసం ప్రభుత్వం 87.3 ఎకరాల భూమిని కేటాయించింద న్నారు. మార్చి 31వ తేదీ లోగా ఆయా భవనాల శ్లాబుల నిర్మాణం పూర్తి కావాలనీ, లేని పక్షంలో ప్రభుత్వమే వాటిని తీసు కొని నిర్మిస్తుందని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన కోసం అడ్హాక్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే సంఘా లు నిర్మించుకునే ఆత్మగౌరవ భవనాలకు లైజనింగ్ ఆపీసర్లను నియమించి సహకారాన్ని అందిస్తా మన్నారు. సమావేశ మందిరాలు, కళ్యాణ వేదికలు, హాస్టళ్లు, రిక్రియేషన్ తదితర సకల సదుపా యాలతో నిర్మాణాలు చేపడుతు న్నామనీ, దసరా లోపు ఆత్మగౌరవ భవనాలు ప్రారంభమవ్వాలని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ బండాప్రకాశ్, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఎస్ తిరుపతిరావు, మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) నర్సింహారెడ్డి పాల్గొన్నారు.