Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూప్-1 మెయిన్స్‌కు సెలెక్ట్ అయిన 123 మంది ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్‌భవన్‌లో గ్రూప్-1 మెయిన్స్‌కు సెలెక్ట్ అయిన 123 మంది ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ విద్యార్థులను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజేంద్రనగర్ స్టడీ సర్కిల్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ఎస్టీ స్టడీ సెంటర్లలో కోంచింగ్ తీసుకుని మెయిన్స్‌కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు మాత్రమే ట్యాబ్‌లు, ప్రతినెల రూ.5 వేలు స్టైఫండ్‌ను ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. ప్రయివేటుకు ధీటుగా విద్యార్థులకు గిరిజన సంక్షేమశాఖ నుంచి అన్ని రకాల సౌకర్యాలను అందజేస్తామనీ, వారు ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జీసీసీ జీఎమ్ సీతారాంనాయక్, జేడీ సబుజ్వల, స్టేట్ మిషన్ మేనేజర్ లక్ష్మీప్రసాద్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.