Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సర్కిల్ ఉద్యోగులు రూ.33,78,200 నిధులను విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తం విలువ చేసే చెక్కును బుధవారం ఆ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ బృందం గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్‌కు అందజేశారు. బ్యాంక్ సిబ్బంది చొరవను గవర్నర్ ప్రశంసించారు. ఈ సంస్థకు ఇచ్చిన నిధులను సైన్యంలో పని చేసిన మాజీ సైనికులు, భర్తలను కోల్పోయిన వారి సంక్షేమానికి ఉపయోగిస్తారు.