Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
నవతెలంగాణ రంగారెడ్డి రీజీయన్ మేనేజర్ మహేందర్రెడ్డి తండ్రి దూదిపాల ఇంద్రారెడ్డి(85) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతిచెందారు. హైదరాబాద్లోని అంబర్పేటలో నివాసం ఉంటున్న ఇంద్రారెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. నవతెలంగాణ రంగారెడ్డి రీజీయన్ మేనేజర్ మహేందర్రెడ్డి అందరి కంటే చిన్నవాడు. ఇంద్రారెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతన్ని నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం రాత్రి చనిపోయారు. ఆయన మృతి పట్ల నవతెలంగాణ ఎడిటర్ సుధాభాస్కర్, సీజీఎం ప్రభాకర్ సంతానం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే నవతెలంగాణ జనరల్ మేనేజర్స్, మేనేజర్స్, బోర్డు మెంబర్లు, సిబ్బంది ఇంద్రారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.