Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2025 అక్టోబర్ నాటికి పనులు పూర్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ స్టేషన్లో పునరాభివద్ది పనులను ప్రారంభించారు. దీనికోసం భూసార పరీక్షలు, స్థలాకృతి (టోపోగ్రాఫిక్) సర్వేను పూర్తిచేశారు. ఈ పనులన్నీ 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. టోపోగ్రాఫిక్ సర్వే ఆధారంగా సైట్ లేఅవుట్, సరిహద్దు నమూనా పనులు పురోగతిలో వున్నాయి. అప్‌గ్రేడ్ చేయబడిన స్టేషన్ బిల్డింగ్‌లో అధునాతనమైన హంగులతో బుకింగ్ కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్టేషన్‌కు ఉత్తరం వైపు వచ్చే మల్టీ-లెవల్ కార్ పార్కింగ్‌కు అనుగుణంగా, ప్రస్తుత బుకింగ్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చాల్సి ఉంటుంది. తద్వారా ఇదివరకే ఉత్తరం వైపు ఉన్న ద్విచక్ర వాహనాల పార్కింగ్ గేట్ నంబర్ 3 సమీపంలో ప్రత్యామ్నాయ ప్రదేశానికి (ఉత్తరం వైపునే) మార్చబడింది. దీనికి సంబంధించిన తవ్వకం పనులు సాగుతున్నాయి. పాత రైల్వే క్వార్టర్స్‌ను తొలగించి, కొత్త ఆర్పిఎఫ్ కార్యాలయ నిర్మాణం కోసం పునాదుల తవ్వకం పనులు పురోగతిలో ఉన్నాయి. పునరాభివద్ధి పనిలో ముఖ్యమైన నిర్మాణ సామగ్రి కోసం కాస్టింగ్ యార్డ్, వర్క్ ఏరియాను ఏర్పాటు చేయడంతో పాటు మెటీరియల్‌ను నిల్వచేసేందుకు భూమిని కేటాయించారు. రాబోయే 40 ఏండ్ల అభివద్ధి అవసరాలను దష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను అభివద్ధి చేస్తున్నట్టు అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు.