Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (యూబీఐడీఈఎఫ్) క్యాలెండర్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ సురేష్ చంద్ర తెల్లి, హెచ్ఆర్ విభాగం చీఫ్ మేనేజనర్ ఎ విజరుకుమార్ బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ చంద్ర తెల్లి మాట్లాడుతూ వైకల్యం శరీరానికే కానీ మానసిక సామర్థ్యానికి కాదని చెప్పారు. కదల్లేని స్థితిలో వీల్ చైర్లో కూర్చుని కేవలం అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్‌పై పరిశోధన చేసి రహస్యాలు ఛేదించిన స్టీఫెన్ హాకింగ్ అందరికీ ఆదర్శమని అన్నారు. లూయిస్ బ్రెయిలీ కనిపెట్టిన ఆరు చుక్కల లిపి ఇప్పటికీ అనేక దేశాలు, భాషలు అంధుల కోసం వాడుతున్నాయని వివరించారు. ఇలాంటి మేధావులు ఈ ప్రపంచానికి ఆదర్శమనీ, భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశకులని అభిప్రాయపడ్డారు. దృష్టి లోపం ఉన్న వారందరి అవసరాలను పరిగణనలోకి తీసుకుని వారి కోసం ప్రత్యేకంగా స్పర్శ్ బ్రెయిలీ డెబిట్ కార్డును రూపొందిం చిందన్నారు. ఈ కార్యక్రమంలో యూబీఐడీఈఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పి రాజశేఖర్, నాయకులు ఆర్ స్వామినాయక్, పి కృష్ణయ్య, దివ్యశ్రీ, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు.