Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికమంత్రికి టీఎమ్‌యూ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీకి బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించి, కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేశారనీ, మిగిలిన రూ.వెయ్యి కోట్లు కూడా ఇవ్వాలని టీఎమ్‌యూ నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం టీఎమ్‌యూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏఆర్ రెడ్డి, థామస్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్‌గౌడ్, ముఖ్య సలహాదారులు యాదయ్య, మారయ్య, కోశాధికారి రాఘవరెడ్డి తదితరులు ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిసి, ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీసీఎస్, పీఎఫ్్ బకాయిలు, బాండ్ అమౌంట్ చెల్లించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలైన వేతన సవరణ, యూనియన్ పునరుద్ధరణ, జాబ్ సెక్యూరిటీ విషయాల్లో ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి తప్పక ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని యూనియన్ నాయకులు తెలిపారు.