Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర అర్థగణాంక శాఖ నివేదికను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్లోని గణాంక భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు డాక్టర్ జి.ఆర్ రెడ్డి, అర్థగణాంక శాఖ డైరెక్టర్ జి దయానందం, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టీఎస్ డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామకృష్ణ, కన్సల్టెంట్ రామభద్రం, స్టాటిస్టికల్ అదనపు డైరెక్టర్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పురోగతి, జీడీపీ, అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరాలను ఈ ప్రచురణలో సవివరంగా పేర్కొన్నారు.