Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
- చాప కింద నీరులా రైతు వ్యతిరేక విధానాలు
- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
- మోడీ పాలనలో అన్నదాతల ఆకలి చావులు
- ప్రముఖ సినీ డాన్సర్ రాకేష్ మాస్టర్
- సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో ట్రాక్టర్ల ర్యాలీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు మార్చుకోకుంటే మోడీని గద్దె దించుతామని తెలంగాణ రైతు సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.సాగర్, పశ్య పద్మ హెచ్చరించారు. మోడీ పాలనలో అన్నదాతలకు ఆకలి చావులు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి బొంగ్లూర్ మీదుగా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టి.సాగర్ మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పంట ఉత్పత్తికి 50 శాతం అదనపు మద్దతు ధర అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా రుణ విముక్తి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలతో చర్చించకుండా విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదానికి పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాల ఫలితంగా విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకున్పప్సటికీ గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గృహ వినియోగదారులకు సైతం నెలకు రూ.800 మినిమం బిల్లు చెల్లించే పరిస్థితి తీసుకురానున్నదన్నారు. కౌలు రైతులకు, రైతాంగానికి నెలకు రూ.5000 పింఛన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడా పారిశ్రామిక నేతలకు చెందిన రూ.11 లక్షల కోట్ల రుణాలు మోడీ ప్రభుత్వం ఎలా మాఫీ చేసిందని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతు న్నాయన్నారు. మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
పశ్య పద్మ మాట్లాడుతూ.. 500 సంఘాలతో సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పడిందని తెలిపారు. తమ పోరాటాలతోనే మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. కానీ గడిచిన 11 నెలలుగా మోడీ ఇచ్చిన హామీని సైతం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ డాన్సర్ రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెడుతున్న రైతాంగం అన్నమో రామచంద్ర అని చస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.
కార్మికులు, రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతుల ఆత్మఘోష మోడీకి వినిపించే విధంగా బలమైన ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, జిల్లా అధ్యక,్ష కార్యదర్శులు రామచందర్, మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జంగయ్య, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.