Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో స్మారక స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశం కోసం అమర జవాన్లు చేసిన త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రగతిభవన్‌లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసు కున్నారు. అమర జవానులకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు. ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ అనం తరం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో అమర జవానుల స్మారక స్థూపం వద్దకు వెళ్లి జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ కార్య క్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, శంభీపూర్ రాజు, మధుసూధనాచారి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎంఓ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.