Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గంగారాముకు చెందిన దేవయ్యకు పదెకరాల పొలముంది. యాసంగీలో రెండెకరాల్లో వరి, మిగతా పొలంలో గోధుమ, మొక్కజొన్న, కూరగాయలు సాగు చేశాడు. ఐదారు రోజులుగా కరెంట్ సరిగ్గా రాకపోయే సరికి ఆరుతడి పంటలకు నీళ్లు పెట్టకపోవడం వల్ల వాడుపట్టాయని తెలిపాడు. కరెంట్ కోతల వల్ల మోటర్ వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని పేర్కొన్నాడు. సర్దార్ అనే రైతు రెండెకరాల్లో గోధుమ, ఎకరంలో వరిసాగు చేశాడు.
- అనధికారిక కోతల వల్ల తిప్పలు
- వరి, ఆరుతడి పంటలకు నీటి ఎద్దడి
- ఇబ్బంది పడుతున్న బోర్లు, బావుల మోటర్ల రైతులు
- ఎండలు ముదిరితే మరింత కష్టం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
అనధికారిక విద్యుత్ కోతల వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతింటున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని కొండాపూర్, గంగారం, గిర్మాపూర్, సదాశివపేట మండలం పెద్దాపూర్ వంటి గ్రామాల్లో వ్యవసాయ బోర్ల కింద వరి, గోధుమ, మొక్కజొన్న, శనగ, పసుపు, ఉల్లి పంటలతో పాటు కూరగాయలు, ఆకు కూరలు సాగుచేస్తున్నారు. మామిడి, సపోట, కొబ్బరి, జామ ఇతర పండ్లు, పూల మొక్కల నర్సరీలు 500 వరకు సాగవుతున్నాయి. ఈ పంటలకు బోరు బావుల వ్యవసాయ మోటర్ల ద్వారానే నీటి పారకం జరుగుతుంది. త్రిఫేజ్ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే మోటార్లు నడు స్తాయి. 15 రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తుం డటంతో వరినాట్ల పనులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ముందస్తుగా వరినాట్లు పూర్తయి పచ్చపడుతున్న పైర్లకు సరిపడా నీళ్లు అందట్లేదు. అలాగే ఆరుతడి పంటలకు మూడు నాలుగు రోజుకో తడి చొప్పున నీళ్లు కడతారు. నర్సరీలకు రోజూ ఉదయం, సాయంత్రం పూట నీళుపెడతారు. కరెంట్ కోతలు, తరచూ సర ఫరాలో బ్రేక్ డౌన్స్ అవుతుండటంతో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ట్రిప్ అవ్వడం, ఫీజులు పోవడం వంటి సాంకేతిక సమస్యలతో పంటలెండి పోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గంగారాముకు చెందిన దేవయ్యకు పదెకరాల పొలముంది. యాసంగీలో రెండెకరాల్లో వరి, మిగతా పొలంలో గోధుమ, మొక్కజొన్న, కూర గాయలు సాగు చేశాడు. ఐదారు రోజులుగా కరెంట్ సరిగ్గా రాకపోయే సరికి ఆరుతడి పంటలకు నీళ్లు పెట్టకపోవడం వల్ల వాడుపట్టాయని తెలిపాడు. కరెంట్ కోతల వల్ల మోటర్ వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని పేర్కొన్నాడు. సర్దార్ అనే రైతు రెండెకరాల్లో గోధు మ, ఎకరంలో వరి సాగు చేశాడు. గోధు మకు నీళ్లు కట్టడానికి కరెంట్ కోత వల్ల వీలుకావడం లేదని తెలిపాడు. పొద్దున్నే నీళ్లు పెడదామని ఉదయం 6గంట లకు పొలం వద్దకెళ్తే సాయంత్రం వరకు కరెంట్ రాలేదన్నాడు. గోధు మ, ఇతర ఆరుతడి పంటలకు నీళ్లు కట్ట లేదన్నాడు. అప్పటికే తడారిపోయిన పైర్లకు నీళ్లు కట్టకపోయేసరికి ఎండిపోతున్నాయని తెలి పాడు.
సంగారెడ్డి జిల్లాలో 99,616 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. యాసంగి సీజన్లో 60 వేల ఎకరాల్లో వరినాట్లేశారు. మెదక్ జిల్లాల్లో 57693 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. యాసంగిలో 1.35 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మరో 50 వేల ఎకరాల్లో నాట్లు వేయనున్నారు. సిద్దిపేట జిల్లాలో లక్ష ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జిల్లాలో 80 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. యాసంగిలో వరితో ఆరుతడి పంట లేశారు. వీటికి ఎక్కువ మొత్తంలో విద్యుత్ మోటర్ల ద్వారానే నీటిని అంది స్తున్నారు.
అనధికారిక కోతలు..
వ్యవసాయానికి ఒక్కో సర్కిల్లో ఒక్కో విధంగా కరెంట్ సరఫరా అవుతోంది. ఎక్కువ ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, కొన్ని ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు, ఇంకొన్ని చోట్ల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇలా ఆయా సర్కిల్స్, సబ్స్టేషన్ల వారిగా సగటున రోజుకు పది నుంచి 12 గంటలు వ్యవసాయానికి సరఫరా చేస్తున్నారు. ఇందులో మధ్యమధ్యలో నాలుగైదు సార్లు కోత పెడుతున్నారు. సరఫరాలో మధ్య మధ్యలో ట్రిప్ అవ్వడం, సాంకేతిక లోపాల పేర కట్ కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోతలకు తోడు ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో డిసెంబర్ నెలలో 353 ట్రాన్స్ఫార్మర్లు, జనవరిలో 182 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ ఈ నెలలో 350 ట్రాన్స్ఫార్మర్లు వరకు కాలిపోయినట్టు సమాచారం. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసి బిగించడానికి రెండు మూడు రోజులు పడుతుండటంతో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కోతల వల్ల పొలాలు ఎండుతున్నరు: భూమయ్య, రైతు, రేగోడు, మెదక్ జిల్లా
వారం పది రోజులుగా కరెంట్ కోతలు పెడుతున్నారు. పైర్లు ఇప్పుడే పచ్చపడుతున్నాయి. రోగా లొస్తే మందులు కొట్టినం. చలి తగ్గి ఎండ పెరిగే సరికి నీటి విని యోగం పెరిగింది. తీరా కరెంట్ సరిగ్గా రాకపోయే సరికి కింది పొలా లకు నీళ్లు పారడంలేదు. కరెంట్ 12 గంట లిస్తున్నమని లైన్మెన్ చెబుతడు. మోటరు పెడితే ఎప్పుడు పోస్తదో ఎప్పుడు ఆగిపోతదో తెల్వని పరిస్థితి. పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నం.
పొలాల వద్దే ఉంటున్నం: దేవయ్య, గంగారం, సంగారెడ్డి జిల్లా
కరెంట్ కోతల వల్ల పొలాల వద్దే ఉంటున్నం. కరెంట్ వచ్చిందంటే మోటర్ పెడతం. పోయి ఎప్పుడు వస్తదో తెల్వక బావికాడే ఉండాల్సి వస్తుంది. వరి నాట్లేసి పది రోజులైంది. సరిగ్గా నీరు పారట్లేదు. గోధుమ, మొక్కజొన్న, మిరప, ఆకుకూరలు, కూరగాయలకు నీళ్ల తళ్లు సమయానికి పెట్టకపోతే ఎండిపోతయి. రెండు మూడు రోజులుగా కరెంట్ సరిగ్గా రాక పైర్లన్నీ వాడుబట్టినయి. రోజూ కరెంట్ తీస్తే పంటలన్నీ ఎండి పెట్టుబడి మట్టిపాలవుతుంది.
నీటిఎద్దడితో దెబ్బతింటున్న పైర్లు
కరెంట్ కోతల వల్ల ఆరుతడి పంటలకు నీటి ఎద్దడి ఏర్పడుతుంది. మోటర్లు నడవక కింది పొలాలు వాడుబట్టిపోతున్నాయి. వరి, ఇతర పైర్లకు తెగుళ్లు సోకాయి. పురుగుమందులు పిచికారి చేస్తున్నం దున పొలాల్లో గుంటలు పడి నీటి మట్టం తగ్గింది. పైర్లు ఎదగడం, చలితగ్గి ఎండలు కాస్తుండటంతో నీటి విని యోగం పెరుగుతోంది. ఆటోమెటిక్ స్టాటర్ పెడితే వచ్చి పోయే కరెంట్ ఎచ్చుతగ్గుల వల్ల మోటర్లు కాలి పోతు న్నాయి. గోధుమలు, మొక్కజొన్న, కూర గాయలు ఇతర ఆరుతడి పైర్లకు సమ యాను కూలంగా నీరు
కట్టలేకపోతున్నారు.