Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద.మ.రైల్వే మహిళా సంక్షేమ సంస్థ ఉపాధ్యక్షురాలు పీ శ్రీలత
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దివ్యాంగ విద్యార్థులు అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలు వినియోగించుకొని జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ ఉపాధ్యక్షురాలు పీ శ్రీలత అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా చిలకలగూడలోని విద్యావిహార్ హైస్కూల్, మెట్టుగూడలోని ఆకాంక్ష దివ్యాంగుల పాఠశాలల్లో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. విద్యార్థులు విద్యా నైపుణ్యాలు, క్రీడలు మరియు సాంస్కతిక అంశాల్లో ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు. 1974లో ఏర్పాటైన విద్యావిహార్ పాఠశాల 1997-98లో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయబడిందనీ, దీనిలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు 510 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. అలాగే రైల్వే పేరెంట్స్ అసోసియేషన్ సహకారంతో రైల్వే కుటుంబాలలోని దివ్యాంగుల పిల్లల కోసం ఆకాంక్ష పాఠశాల నడపబడుతుందనీ, దీనిలో 60 మంది విద్యార్థులకు విద్యతోపాటు ప్రీ ఒకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు వివరించారు. అనంతరం సంస్థ కార్యవర్గ సభ్యులతో కలిసి లాలాగూడలోని సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో వార్డుల్లోని ఇన్పేషెంట్లకు ఉపయోగపడే ఉపకరణాలు, పిల్లల వార్డులో చిన్నారులకు ఆట బొమ్మలను పంపిణీ చేశారు.