Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నైపుణ్యాభివద్ధి మరియు వ్యవస్ధాపక మంత్రిత్వ శాఖ (ఎంఎస్డిఇ) హైదరాబాద్‌లో జాతీయ అప్రెంటిస్ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించినట్లు ఆ సంస్థ తెలిపింది. తెలంగాణా రాష్ట్రంలో తొలిసారి ఎన్టిఎస్ఐ వద్ద నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో ఐటిఐలు, జూనియర్ కాలేజీల్లోని 350 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆ సంస్థ తెలిపింది. అప్రెంటిస్‌షిప్ సంస్కరణలు, శిక్షణల అమలును వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా 250కంటే ఎక్కువ వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా సంస్థలు, ఔత్సాహికులు, భాగస్వాముల నడుమ అప్రెంటిస్‌షిప్ సంస్కరణల పట్ల అవగాహన కల్పించనున్నారు. రీజినల్ డైరెక్టోరేట్, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ సంబంధిత ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.