Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశాభివృద్ధిలో రైల్వేలది కీలకపాత్ర అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సంద ర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఆర్పీఎఫ్ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసంద ర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జోన్ పరిధిలో రూ.13,787 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామనీ, గతేడాదితో పోలిస్తే ఇది 35 శాతం అధికమని చెప్పారు. అలాగే సరుకు రవాణాలోనూ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సముపార్జిం చామన్నారు. 189 మిలియన్ల ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేర్చి, రూ.3,782 కోట్ల ఆదాయాన్ని గడించినట్టు చెప్పారు. భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.