Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంఠేశ్వర్
గణతంత్ర దినోత్సవం రోజునే పశుగణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నిజామాబాద్ నగరంలోని సారంగాపూర్ డెయిరీ ఫార్మ్ వద్ద డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెయిరీ డెవలప్మెంట్ శాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన పెద్ద కాసులు శ్రీశైలం(52) గతేడాది కిందట వరంగల్ నుంచి నిజామాబాద్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా బదిలీపై వచ్చారు. 11రోజుల కిందట అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. కాగా, బుధవారం కామారెడ్డిలో జరిగిన సమావేశంలోనే కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి వారి యోగక్షేమాలను కనుక్కొని జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించారు. కానీ తండ్రి మాటలకు అనుమానం వచ్చిన కుమారుడు రవితేజతోపాటు కుటుంబ సభ్యులు నిజామాబాద్‌కు బయలుదేరి వచ్చారు. కానీ అప్పటికే 'తన చావుకు ఎవరూ కారణం కాదు' అని సూసైడ్ నోట్ రాసి శ్రీశైలం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఏడీ కార్యాలయానికి వచ్చిన కుటుంబ సభ్యులు శ్రీశైలం ఉంటున్న గది లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో దాన్ని బద్దలు కొట్టారు. అప్పటికే ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఆరో టౌన్ ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.