Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను ప్రభుత్వం భయ బ్రాంతులకు గురిచేస్తున్నదని బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కల్పదర్శి చైతన్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ల సర్వీస్ వెరిఫికేషన్లకు సంబంధించి సీనియార్టీ జాబితాలో జనరల్, రిజర్వేషన్ కేటగిరీలను ఒకే కటాఫ్లో పిలవడాన్ని తీవ్రంగా ఖండించారు. దీన్ని బట్టి చూస్తే ఆడిక్విసిని అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నదని తెలిపారు.