Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే, దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే తాము పోరాడుతున్నాం' అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. అదే సందర్భంలో ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.