Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీహార్లోని పాట్నాలో ఫిబ్రవరి 15 నుంచి 20వ తేదీ వరకు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ మహాసభలు జరుగబోతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిండ్ల రమేశ్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మహాసభకు తాను ప్రతినిధిగా వెళ్లబోతున్నట్టు పేర్కొన్నారు. ఐదేండ్ల కాలంలో తమ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలు, కార్యక్రమాలపైనా, నిర్మాణంపైనా సమీక్షించుకుని రాబోయే కాలంలో చేపట్టబోయే పోరాటాల కార్యాచరణను రూపొందించుకుంటామని తెలిపారు.