Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, వివేక్‌తో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు. వారు నమ్మిన సిద్ధాంతంపై నడవాలని సూచించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టా గోష్టిగా ఆయన ముచ్చటించారు. సీఎం కేసీఆర్‌ను గద్దెదించాలన్న లక్ష్యంతో బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌కు, ఆ లక్ష్యం బీజేపీలో నేరవేరడం లేదని అర్థమైందని ఆయన మాటలను బట్టి తెలుస్తుందన్నారు. కేసీఆర్ కోవర్ట్లతో నిండిన బీజేపీని కాదనీ రాజేందర్ ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈటల పరిస్థితి ముందుకు పోలేక, వెనక్కి రాలేక అన్నట్టుగా ఉందన్నారు.ఈటల వామపక్షవాది అయినా... కేసీఆర్ కుట్రతో రైటిస్ట్ పార్టీలోకి పోయేలా చేశారని తెలిపారు. కేవలం కేసీఆర్‌పై వ్యతిరేకతతో బీజేపీలో చేరిన మిగిలిన నాయకులు కూడా ఆ పార్టీలో సంతప్తిగా లేరని చెప్పారు. సచివాలయాన్ని కేసీఆర్ జన్మదినాన కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి రోజున ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు.
పొంగులేటితో భట్టి చర్చలు
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చర్చిస్తున్నారనీ, ఈ మేరకు భట్టికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలిచ్చిందని రేవంత్ స్పష్టం చేశారు. హుజూరాబాద్, మునుగోడులలో సందర్భానుసారమే బీజేపీకి ఓట్లు వచ్చాయే తప్ప మిగిలిన సందర్భాల్లో ఓట్లు రావని తెలిపారు. కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చాక పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తామనీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత వయస్సును 25 నుంచి 21కి తగ్గిస్తామని హామీ ఇచ్చారు.