Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య
నవతెలంగాణ-జనగామ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ంతో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య అన్నారు. గురువారం జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నెల్లుట్ల- పటేల్‌గూడెం భూ పోరాట కేంద్రాల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని సంక్రాంతి క్రీడోత్సవాల్లో గెలిచిన ఔత్సాహితులు, క్రీడాకారు లకు బహుమతుల ప్రదానం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాగయ్య మాట్లాడారు. రాజ్యాంగం మౌలిక సూత్రాలైన సామ్యవాదం, గణతంత్రం, సౌబ్రాతృత్వం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తు న్నదని విమర్శించారు. ఇందులో భాగంగానే సీఏఏ, జీఎస్టీ లాంటి అనేక కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుం దన్నారు. దేశంలో హిందుత్వ మతపరమైన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో హత్యలు, లైంగికదాడులు పెరిగిపోయా యన్నారు. రాష్ట్రాల హక్కులను బలవంతంగా గుంజుకుంటున్నారని తెలిపారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని అన్ని వర్గాల, తరగతుల ప్రజానికానికి రాజ్యాంగాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింగారపు రమేష్, ఎదునూరి వెంకట్రాజం, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోటి దేవదానం, బొట్ల శేఖర్ నాయకులు గోసంగి శంకరయ్య, లగ్గాల రమేష్, పుల్ల రాజేశ్వరి, గడ్డం రేణుక, మునుగొండ రేణుక, పిడుగు సరిత, బండ శ్రీనివాస్, సురేష్, నల్ల ప్రణరు, చిరంజీవి, గోసంగి సందీప్, ఉప్పలయ్య, వేల్పుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.