Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు గురువారం సందర్శకులు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. జంపన్న వాగు వద్ద పుణ్య స్నానాలాచరించి, కళ్యాణ కట్ట వద్ద తలనీనాలు సమర్పించారు. గద్దెల వద్దకు చేరుకుని వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు అధిక సంఖ్యలో భారీగా తరలివచ్చారు. వీరికి ఎండోమెంట్ ఈవో రాజేంద్రం ఆధ్వర్యంలో ఎండోమెంట్ అధికారులు, పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు సకల సౌకర్యాలు కల్పించారు. వనదేవతలను దర్శించుకున్న అనంతరం బయట చెట్ల కింద విడిది చేసి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం వారి గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. పూజారులు కొక్కర కృష్ణయ్య, సిద్ధబోయిన రమేష్, మునీందర్, లక్ష్మణరావు, అరుణ్, కాక సారయ్య, కాక కిరణ్, ఎండోమెంట్ అధికారులు క్రాంతి, రాజేశ్వర్, రమాదేవి, జగదీశ్వర్, బాలకృష్ణ మధు తదితరులు పాల్గొన్నారు.