Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మికుంట రైల్వే స్టేషన్లో నిలిపివేత
నవతెలంగాణ - జమ్మికుంట
అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో మృతదేహం చిక్కుకోగా.. అలాగే రైలు చాలా దూరం ప్రయాణించింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్లో రైలును ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్ నుంచి రామగుండంవైపు వెళ్తుండగా ఇంజిన్‌లో చిక్కుకున్న మృతదేహాన్ని లోకో పైలట్ గమనించారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ మేనేజర్‌కు సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది జమ్మికుంట రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకున్న మృతదేహాన్ని గడ్డపారాలతో తొలగించారు. మృతుడిని హనుమకొండకు చెందిన ఉప్పలయ్య(60)గా గుర్తించారు. జమ్మికుంట రైల్వే స్టేషన్లో అండమాన్ ఎక్స్‌ప్రెస్ గంటపాటు నిలిచిపోయింది.