Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల వారికి.. మరి ముఖ్యంగా చదువుకునే మహిళలకు స్కాలర్షిప్లను అందిస్తున్నట్టు ఆర్థిక సేవల కంపెనీ సింక్రోనీ తెలిపింది. 'ఎడ్యుకేషన్ యాజ్ యాస్ ఈక్వలైజర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద సింక్రోనీ ఫౌండేషన్ మద్దతును అందిస్తున్నట్లు పేర్కొంది. స్కాలర్షిప్లు, మెంటర్షిప్స్కు రూ.44 లక్షలు (55వేల డాలర్లు) కేటాయించినట్లు తెలిపింది.
బాలికా విద్య పట్ల కంపెనీ అధికంగా దృష్టి సారించడంతో సింక్రోనీ ప్రస్తుతం 119 మంది విద్యార్ధులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా మద్దతు అందిస్తుందని తెలిపింది. వీరిలో 88 శాతం మంది మహిళా విద్యార్ధులు ఉన్నారని వెల్లడించింది.