Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీబీసీ డాక్యుమెంటరీని రాష్ట్రంలో ప్రదర్శి ంచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె ధర్మేంద్ర, వలీ ఉల్లా ఖాద్రీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రను స్పష్టంగా బట్టబయలు చేస్తూ బీబీసీ ఇండియా 'ది మోడీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీ ని విడుదల చేసిందని తెలిపారు. దీన్ని రాష్ట్రంలో విస్తృతంగా ప్రదర్శించాలని కోరారు. మత రాజకీయాల ఆధారంగా ప్రధాని అయ్యి దేశాన్ని కించపరిచిన మోడీ నిజ స్వరూపాన్ని సమాజానికి తెలియ జేయాలని సూచించారు. అంతర్జాతీయ సమాజంలో భారత దేశ ఖ్యాతిని, సామాజిక ఆర్థికాభి వృద్ధిని నాశనం చేసింది మోడీ అంటూ బీబీసీ ధ్వజమెత్తిం దని తెలిపారు. త్వరలో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.