Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగుళూరు సంకల్ప సభలో ఎంపీ రవిచంద్ర
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం బలిజ కులస్తులకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నదని ఎంపీ రవిచంద్ర అన్నారు. బెంగుళూరులో జరిగిన బలిజల సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మినీ భారత్‌గా మార్చారని కొనియాడారు. మున్నూరుకాపులకు సముచిత పదవులిచ్చి గౌరవిస్తున్నారని చెప్పారు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ళే విద్యార్థులకు రూ.20 లక్షలు ఉచితంగా అందిస్తున్నారనీ, ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి భూమి, డబ్బు కేటాయించారని తెలిపారు. కర్ణాటక బలిజల న్యాయమైన డిమాండ్స్ సాధనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఆయన ప్రస్తావించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు ఆకుల రజిత్, మరికల్ పోత సుధీర్ కుమార్, ప్రముఖ వాస్తుశిల్పి ముద్దు వినోద్ తదితరులు పాల్గొన్నారు.