Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను ఆదేశించిన డీజీపీ అంజనీ కుమార్
- అధికారులకు ఒక రోజు శిక్షణనిచ్చిన సీఐడీ
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మాదక పదార్థాల రవాణా, వినియోగాలను నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలనీ, అందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్డీపీఎస్ చట్టం అమలు, సమగ్ర దర్యాప్తులపై యాంటీ నార్కొటిక్ డ్రగ్ టీమ్‌లకు చెందిన అధికారులకు సీఐడీ ఆధ్వర్యంలో శుక్రవారం ఒకరోజు శిక్షణను ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన అంజనీకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి మొదలైన మాదక పదార్థాల రవాణా, వినియోగాలను అరికట్టడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మాదక పదార్థాల తయారీ జరగనప్పటికీ.. డ్రగ్స్ మాఫియా హైదరాబాద్‌ను ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రవాణా కేంద్రంగా ఉపయోగించుకుంటు న్నారని అన్నారు. ముఖ్యంగా, యువతతో పాటు కొన్ని సామాజిక వర్గాలకు ఒక వ్యూహం ప్రకారం మాదక పదార్థాలను చేరవేస్తున్నారని, గొలుసుకట్టుగా సాగుతున్న ఈ లింకును తెంచాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ అన్నారు. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంటీ నార్కొటిక్ బ్యూరోకు చెందిన ప్రతి అధికారీ కలిగి ఉండాలనీ ఆయన నొక్కి చెప్పారు. గతేడాది డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్న 1277 మందిని అరెస్టు అయ్యారనీ, ఇందులో 218 మందిపై పీడీ చట్టం ప్రయోగం జరిగిందని అన్నారు. గత మూడేండ్ల లో మాదక పదర్థాల రవాణా, వినియోగానికి పాల్పడుతున్న 7,478 మందిపై రాష్ట్రంలో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయటం జరిగిందని, ఇందులో 416 మందిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయటం జరిగిందని అంజనీ కుమార్ వివరిం చారు. రాష్ట్రంలో మాదక పదార్థాల రవాణాను కూకటివేళ్లతో పెకిలించి వేయడానికి ప్రత్యేకించి యాంటీ నార్కొటిక్ బ్యూరోను ఏర్పాటు చేసి అందకు అసవరమైన మౌలిక సదు పాయాలను కల్పించా మని ఆయన తెలిపారు. సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ డ్రగ్స్ రవాణా, వినియోగం జరుగుతున్న ప్రాంతాల గురించి కూలంకశంగా వివరించారు. ముఖ్యం గా, ఏయే ప్రాంతాల నుంచి హైదరా బాద్ ద్వారా మాదక పదార్థా లు పక్క రాష్ట్రాలకు తరలుతు న్నది ఆయన వివరించారు. గత మూడేండ్ల లో 89 వేల కిలోల గంజాయితో పాటు 710 కిలోల మాదక పదార్థాలను రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం సూపరింటెం డెంట్ గంగా ధరన్ మాట్లాడుతూ.. ఎన్డీపీఎస్ యాక్ట్‌ను ఏ విధంగా వినియోగించాలి, అందుకు నిందితుల కు సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరించాలి, దర్యాప్తును ఏ విధంగా కొనసాగించాలి, అందుకు ప్రాథమికం గా పాటించాల్సిన జాగ్రత్త లు ఏమిటి.. తదితర అంశాలను ఆయన అధికారులకు వివరించారు. ఫోరెన్సెక్ సైన్స్ ల్యాబ్ హైదరాబాద క్లూస్ టీమ్ డైరెక్టర్ వెంకన్న మాట్లాడుతూ.. మాదక పదార్థాలు పట్టుబడ్డ సమయ ంలో అక్కడ ఆధారాలను సైంటిఫిక్‌గా ఏ విధంగా సేకరిం చాలి? మొదలైన జాగ్రత్తలను వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమా నికి రాష్ట్రవ్యాప్తంగా యాంటీ నార్కొటిక్ సెల్‌కు చెందిన 228 మంది అధికారులు పాల్గొనగా యాంటీ నార్కొటిక్ బ్యూరో ఎస్పీ అనసూయ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.