Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసి జోనల్ మేనేజర్ వెల్లడి
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) తమ పాలసీదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ ముక్కవిల్లి జగన్నాథ్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా కార్యాలయం పరిధిలో జాతీయా జెండావిష్కరణ చేశారు. అనంతరం ఆయన ఉద్యోగులు, ఎజెంట్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థ, వ్యక్తిగతంగానూ వృద్థి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్లు విద్యానంద్ ఝా, వినీత్ శ్రీవాస్తవ్, సాయినాథ్, కె మురళిధర్, సీనియర్ డిఎం రాజీవ్ బిస్వాస్ తదితరులు పాల్గొన్నారు.