Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్కు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు గతంలో శిక్షణ ఇచ్చే వారనీ, అయితే దాన్ని మధ్యలో నిలిపివేశారని తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల జేఏసీ తెలిపింది. ఇప్పుడు ఆ శిక్షణను తిరిగి ప్రారంభించాలని కోరింది. ఈ మేరకు ఆ జేఏసీ నాయకులు వెంకట్ రెడ్డి తదితరుల నేతృత్వంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస రావును శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. 2015 జూన్ 29న జారీ చేసిన జీ.వో.నెంబర్ 428 ప్రకారం శిక్షణా తరగతులను నిర్వహించారని గుర్తుచేశారు. అయితే వాటిని మధ్యలోనే నిలిపేశారని తెలిపారు. అప్పటికే పూర్తయిన శిక్షణ వివరాలు ప్రభుత్వానికి సమర్పించి, వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి తాజాగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలకు అతి తక్కువ ధరలకు వైద్యం చేస్తున్నరాష్ట్రంలోని 45 వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీ పట్టణ, గ్రామీణ వైద్యులకు చట్ట భద్రతనిచ్చే విధంగా గుర్తింపు కార్డును, సర్టిఫికెట్లను ఇప్పించాలని కోరారు.