Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డులోని భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లయిమ్స్‌ను పరిష్కరించాలి
- మంత్రి మల్లారెడ్డికి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్
యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పంచుతామన్న లక్ష మోటారు సైకిళ్లను వెంటనే అందజేయాలని భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల యూనియన్ డిమాండ్ చేసింది. వెల్ఫేర్బోర్డులో పెండింగ్‌లో ఉన్న క్లయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలని కోరింది. బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలనీ, బోర్డులోని సెస్సు నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు డిప్యూటీ కమిషనర్‌కు ఆ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరు రాములు, ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వెల్ఫేర్ బోర్డులో రూ.3,700 కోట్ల సెస్సు నిధులున్నాయనీ, వాటిని బోర్డు అడ్వైజరీ కమిటీ నిర్ణయాలతో ఖర్చు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 54వేల క్లయిమ్స్ని వెంటనే క్లియర్ చేయాలని విన్నవించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే రూ.6 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు, సాధారణ మరణాలకు ఇస్తున్న లక్ష రూపాయలను రూ.5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వివాహం, ప్రసూతి కానుకలు, కార్మికులు చనిపోతే దహన సంస్కార ఖర్చులకు ఇచ్చే రూ. 30 వేలను..లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ శ్రమ్ కార్డులను కార్మికులందరికీ ఇవ్వాలని కోరారు. వలస కార్మికుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.