Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంతోకాలంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులు ఎదురు చూస్తున్న జీ.వో.నెంబర్ 317 అమలుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌ను అమలు చేసేందుకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ అనుమతించారు. గతేడాది డిసెంబర్ 12న జీ.వో.నెం.317ను అమలు చేసేందుకు అనుమతించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ లేఖ రాశారు. ఆ లేఖను సాధారణ పరిపాలనాశాఖ పరిశీలించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌ను అమలు చేసేందుకు గ్రీన్ సిగల్ ఇవ్వడంతో ఉద్యోగుల బదిలీలకు ఉన్న ఆటంకాలు తొలిగిపోయాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే నవతెలంగాణ పలుమార్లు కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే.
ధన్యవాదాలు .. టీయూఎంహెచ్‌ఇయూ
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో జీ.వో.317 అమలుకు అనుమతించినందుకు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్ ఇయూ) కార్యదర్శి భైరపాక శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. టీవీవీపీ ఉద్యోగులు బదిలీల కోసం చేసుకున్న వినతిపై సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.