Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణం రైతులకు చెల్లింపులు
- పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వానాకాలం సీజన్లో పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి కొను గోలు చేసిన ధాన్యానికి సంబంధిం చిన చెల్లింపుల కోసం నాబార్డ్ ద్వారా రూ. 3 వేల కోట్ల రుణం తీసుకు న్నట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడు దల చేశారు. పౌరసరఫరాల సంస్థ బోర్డు సమావేశంలో రుణ సేకరణకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రుణ సేకరణ నిమిత్తం నిర్వహించిన టెండర్లలో నాబార్డ్ సింగిల్ టెండ ర్ను వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అను మతిచ్చిన రుణపరిమితి నిబంధన లకు అనుగుణంగా రుణ సేకరణ చేసినట్టు రవీందర్ సింగ్ ఈ సంద ర్భంగా స్పష్టం చేశారు. ఈ ఏడాది వానాకాలంలో పౌరసర ఫరాల సంస్థ 9.65 లక్షల మంది రైతుల నుంచి రూ.13,189 కోట్ల విలువ చేసే 64.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసిన సంగతి తెలి సిందే. కాగా రూ.3 వేల కోట్ల రూపా యల్లో రూ.500 కోట్ల వరకు రైతుల కు చెల్లింపులు చేయగా, మిగిలిన మొత్తం గతంలో తీసుకున్న స్వల్పకా లిక రుణాలను తిరిగి చెల్లించ డానికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.