Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్), ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఏపీఐఎస్), వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ 4.0ను శుక్రవారం నిర్వహించాయి. ప్రతిభావంతులైన చివరి ఏడాది విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, నిపుణులను ఎంపిక చేసేందుకు దీన్ని చేపట్టాయి. సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్‌షిప్, వివిధ రకాల భద్రతా కార్యక్రమాలను బహిర్గతం చేసేందుకు ఇది రూపొందించబడింది. వాటిలో వివిధ వాణిజ్య, ఓపెన్ సోర్స్ సాధనాలను ఉపయోగించి వివిధ నెట్‌వర్క్‌లు, వెబ్, మొబైల్ అప్లికేషన్లలో వల్నరబిలిటీ అసెస్మెంట్, పెనెట్రేషన్ టెస్టింగ్ ఉన్నాయి. ఏపీలో వివిధ కాలేజీల నుంచి 623 మంది విద్యార్థులు పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 128 మంది ఈనెల 25న వీఐటీ ఏపీ వర్సిటీ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించిన ఫైనల్‌కు ఎంపికయ్యారు. ముఖ్యఅతిధిగా హాజరైన ఏపీటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రమణారెడ్డి మాట్లాడుతూ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్లో పురోగతి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్ విజయరాఘవ నాయక్, ఐటీ ఈసీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జి జాకన్ విక్టర్, వీఐటీ ఏపీ వర్సిటీ వీసీ ఎస్వి కోటారెడ్డి, రిజిస్ట్రార్ ఎం జగదీశ్ చంద్ర, ఐఐఈసీ డైరెక్టర్ అమీత్ చవాన్, సైబర్ సెక్యూరిటీ సీఈవో గణేష్‌రెడ్డి, ఏపీటీఎస్ జనరల్ మేనేజర్ డి వెంకటాచలం, ఏపీఐఎస్ స్టార్టప్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అధికారి ఎస్ శ్రీధర్ పాల్గొన్నారు.