Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం సినీ నటుడు నందమూరి తారకరత్న మసీదు దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక్కసారిగా టిడిపి శ్రేణులు తోసుకోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన కుప్పంలోని పిఇఎస్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఆయన వెంట సినీనటుడు బాలకృష్ణ వెళ్లారు. తారకరత్నకు గుండె ఎడమ వాల్వ్ 95 శాతం బ్లాక్ అయినట్లు, తీవ్ర ఉధృతిలో గుండెపోటు (మాసివ్ హార్ట్స్ట్రోక్) వచ్చినట్టు వైద్యులు తెలిపారని బాలకృష్ణ చెప్పారు. ఆంజియోగ్రామ్ చేశారని, స్టంట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రాణభయం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యలు తెలిపారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకెళ్దామని అనుకున్నామని, ఈ పరిస్థితిలో పేషెంట్‌ని తరలిస్తే రెండోసారి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెప్పారని తెలిపారు. దీంతో, ఇక్కడే ఉంచి వైద్యం చేయిస్తున్నామని, బెంగళూరులోని నారాయణ హృదయాల నుంచి నలుగురు గుండె వైద్య నిపుణులు విమానంలో ఇక్కడికి వచ్చారని, తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వారు కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.