Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుకులాలు, ఐ అండ్ పీఆర్లో ఖాళీలు...
- ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గురుకులాలు, సమాచార పౌరసంబంధాలశాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆర్థికశాఖమంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేరుస్తున్నదని తెలిపారు. బీసీ గురుకుల విద్యాలయాల్లో 1,499 పోస్టులను గురుకులాల నియామక మండలి ద్వారా భర్తీ చేస్తారని పేర్కొన్నారు. దీనిలో 480 లెక్చరర్ పోస్టులు, 324 టీజీటీ, 235 పీజీటీ, 185 జూనియర్ లెక్చరర్, 60 ల్యాబ్ అసిస్టెంట్, 37 లైబ్రేరియన్, 33 ఆర్ట్-క్రాఫ్ట్-మ్యూజిక్ టీచర్, 30 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, 33 పీఈటీ, 10 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ నియామకమండలి ద్వారా మరో 63 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో గ్రూప్-3, గ్రూప్-4లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారన్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 417 జూనియర్ లెక్చరర్ పోస్టులను గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 87 టీజీటీ, 6ఆర్ట్- క్రాఫ్ట్-మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. సమాచార, పౌర సంబంధాల శాఖలో 166 పోస్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీనిలో 4 పీఆర్వో, 16 ఏపీఆర్వో, 82 పబ్లిసిటీ అసిస్టెంట్, 41 అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్, 22 ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయని తెలిపారు.