Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రిపబ్లిక్ డే రోజు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని కించపరిచేలా ఉన్నాయని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి అన్నారు. ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తూ శుక్రవారంనాడాయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రోటోకాల్ పాటించట్లేదని చెప్పిన తమిళ సై... ఏ ప్రోటోకాల్ ఉందని తెలంగాణ గురించి పాండిచ్చేరిలో విషం గక్కారని ప్రశ్నించారు. ఆమెకు కావాల్సింది దేశ ప్రధాని మోడీకి నమ్మిన బంటుగా ఉంటూ, బీజేపీకి అనుకూలంగా వ్యహరిస్తూ తెలంగాణ లో ఆ పార్టీ బలోపేతానికి జాతీయ నాయకురాలిగా పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్‌భవన్‌ను బీజేపీ అడ్డాగా మార్చేశారని విమర్శించారు. ప్రగతిభవన్‌కు రాజ్‌భవన్‌కు మధ్య ఆమే అంతరం పెంచుకున్నదని చెప్పారు.