Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిటరరీ ఫెస్టివల్లో వక్తలు
నవతెలంగాణ-హిమాయత్ నగర్
సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ప్రచారం చేయడమే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశమని ఫెస్టివల్ డైరెక్టర్లు అమిత దేశారు, డాక్టర్ కిన్నెర మూర్తి, డాక్టర్ టి.విజరు కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా ఉన్న విద్యారణ్య హైస్కూల్లో 'హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్- 2023'ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్ సౌజన్యంతో అనేక సాహిత్య, సాంస్కృతిక, ప్రచురణ సంస్థల మద్దతుతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పండుగ దేశంలోని సాంస్కృతిక క్యాలెండర్లో ఒక విస్మరించలేని సంఘటనగా ఉద్భవించిందని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సంస్కృతిక, కళాత్మక తత్వానికి.. అలాగే ఆధునిక సైబరాబాద్ శక్తివంతమైన సంస్కృతిని సూచిస్తుందన్నారు. సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్‌కు ఒక బ్రాండ్ ఉందన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రతి ఏడాదీ జనవరి చివరి వారంలో నిర్వహించే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కార్యక్రమం అన్నారు. స్థానిక, జాతీయ, ప్రపంచ రచయితలు, కళాకారులను ఒకే వేదిక పైకి తీసుకురావడమే కాకుండా రచయితలు, పాఠకులు, కళాకారులు, ప్రేక్షకుల మధ్య వారధిగా పని చేస్తుందన్నారు. మరోవైపు ఔత్సాహిక రచయితలు, ప్రచురణకర్తలు, రచయితలతో సంభాషణలు, పఠనాలు, కథలు చెప్పడం, ప్యానల్ చర్చల వేదికలు, పిల్లల కోసం చర్చలు, ప్రదర్శనలు, సంస్కృతిక కార్యక్రమాలు ఈ ఫెస్టివల్లో ఉంటాయన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక మల్టీ డిసిప్లినరీ బహుళ శైలి ఈవెంట్ అనీ, దాదాపు 150 మంది స్పీకర్లు, రచయితలు, కళాకారులు, విద్వాంసులు, చిత్ర నిర్మాతలు, పాత్రికేయులు, విస్తృత శ్రేణి సృజనాత్మక రంగాలకు ఈ ఫెస్టివల్ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు.