Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళి అర్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, సీపీఐ(ఎం) నేతలు చెరుపల్లి, మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-సూర్యాపేట
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, ఐద్వా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణల తండ్రి అనుములపురి నర్సయ్య గురువారం రాత్రి మృతిచెందారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మీ తదితరులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ కాలనీలోని మున్సిపల్ చైర్పర్సన్ నివాసంలో నర్సయ్య మృతదేహంపై పూలమాలలేసి నివాళి అర్పించారు. సీపీఐ(ఎం) సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శులు మల్లు నాగార్జునరెడ్డి, జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోటగోపి, మేక అశోక్‌రెడ్డి, కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, దాసరి పాండు తదితరులు నివాళి అర్పించారు. నర్సయ్య మృతదేహంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆయన భార్య సునీత పూలమాలలేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నర్సయ్య మరణం ఆయన కుటుంబానికి తీరని లోటన్నారు. కుటుంబీకులను పరామర్శించిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీలు సంజీవనాయక్, జీడి భిక్షం, క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పూర్ణ శశికాంత్, జిల్లా నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.