Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మంది విద్యార్థులకు అస్వస్థత
- పదిమంది విద్యార్థులు ఇండ్లకు తరలింపు
- విద్యాలయాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ
నవతెలంగాణ- కూసుమంచి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో మూడు రోజుల నుంచి రోజుకు కొంతమంది చొప్పున మొత్తం 30 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. దాంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు నవోదయ విద్యాలయంకి వచ్చి పదిమంది పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మిగిలిన విద్యార్థులకు వైద్యం అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పాఠశాలలో వండిన చికెన్ కూరతో భోజనం చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని సమాచారం తెలుసుకున్న వైద్యులు నవోదయ విద్యాలయంను సందర్శించి, విద్యార్థులను పరిశీలించి వైద్యం అందించారు. 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్టు వైద్యులు తెలిపారు.
వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేసిన ఎంఎల్ఏ
జవహర్ నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ విషయం తెలియడంతో వైద్యశాఖ అధికారులను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. దాంతో జిల్లా వైద్య అధికారి డాక్టర్ మాలతి విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు అవసరమైన వైద్యం అందించారు.
తిను బండారాలతోనే వాంతులు: పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రబాబు
విద్యాలయంలోని విద్యార్థులు సంక్రాంతి పండక్కి వెళ్లి, ఇంటి నుంచి తినుబండారాలను తమతో తీసుకొచ్చారు. ఈ తినుబండారాలు వారం కావడంతో అవి తిన్న విద్యార్థులకు వాంతులయ్యాయి. నవోదయ విద్యాలయంలో భోజనం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కాలేదు.