Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ పదవిలో ఆమె ఒక ఏడాది కొనసాగుతారు. 2015 నుంచి ఈ సంస్థ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత సేవలందిస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం పెంచేలా కృషి చేస్తానని ఆమె చెప్పారు.