Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎమ్‌కేఎమ్‌కేఎస్ క్యాలెండర్ ఆవిష్కరణలో ముఠాగోపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత్యకారులంతా ఐక్యతతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం ముషీరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం(టీఎమ్‌కేఎమ్‌కేఎస్) క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలోనే మత్స్య సంపద చాలా పెద్దదనీ, దేశ జీడీపీలో కీలకంగా ఉన్న ఆ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని కోరారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్నారు. మండల, డివిజన్, జిల్లా కేంద్రాలలో అధునాతనమైన చేపల మార్కెట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులు కేటాయించేలా చూస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు గోరింకల నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఠా విజరు కుమార్, రాష్ట్ర కార్యదర్శి తేలు ఇస్తారి, రాష్ట్ర కమిటీ సభ్యులు గాండ్ల అమరావతి ముఠా.దశరథ్, మామిళ్ల జగదీష్, సిహెచ్ వెంకన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు