Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిసారిగా నో పాజిటివ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా కేసులు రాష్ట్రంలో తొలిసారి జీరోగా నమోద య్యాయి. ఈ మహమ్మారి మొదలైనప్పటి నుంచి 24 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసు రాకపోవడం ఇదే మొదటి సారి. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలో 3,690 నమూనాలను పరీక్షిం చారు. వీరందరికి నెగెటివ్ రావడం గమనార్హం. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన ఐదుగురు కోలుకోగా, మరో 19 మంది పాజిటివ్ వచ్చిన రోగులు ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 3,83,86,215 నమూనాలను పరీక్షించగా, అందులో 8,41,486 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 8,37,356 మంది కోలు కున్నారు. 4,111 మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్న వారి సంఖ్య 99.51 శాతంగా ఉన్నది. గతేడాది నవంబర్లో అత్యధికంగా 77 పాజిటివ్ కేసులు రాగా అతి తక్కువగా రెండొచ్చాయి. డిసెంబర్ నాటికి అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్య 15కు తగ్గగా, అతి తక్కువగా ఐదుగా నమోదైన సంగతి తెలిసిందే.